GERD: 24 ఏళ్లుగా కొబ్బరే అతడి ఆహారం.. ఎందుకో తెలుసా?

This man has been on a coconut only diet for 24 years to manage GERD

  • జెర్డ్ సమస్యతో ఆహారం మానివేసిన బాలకృష్ణన్ అనే వ్యక్తి
  • కొబ్బరి తినడం మొదలు పెట్టిన తర్వాత తగ్గిన సమస్య
  • కానీ, ఇది అందరికీ సాధ్యపడకపోవ్చంటున్న వైద్యులు

ఒక వ్యక్తి ఎలాంటి ఆహారం లేకుండా, కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటూ 24 ఏళ్లుగా ఆరోగ్యంగా జీవించి ఉన్నాడంటే నమ్ముతారా..? ఇది నిజం. గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ/గెర్డ్) వల్ల బాలకృష్ణన్ అనే వ్యక్తి ఆహారం మానివేశాడు. కొబ్బరి తింటూ, కొబ్బరి నీరు తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఈ ఆసక్తికర విషయాన్ని నటి, ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్ షెనాజ్ ట్రెజరీ సామాజిక మాధ్యమంపై ఇతరులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని, మరి ప్రొటీన్ మాటేమిటి? అని ఆమె ప్రశ్నించారు. 

బాలకృష్ణ చాలా బలహీన పడిపోవడంతో వైద్యులను సంప్రదించగా, అతడికి జెర్డ్ సమస్య ఉన్నట్టు బయటపడింది. ఈ సమస్యతో ఆహారం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాడు. దీంతో సంప్రదాయ ఆహారాన్ని పూర్తిగా మానేసి, కొబ్బరి తిని, నీరు తాగడాన్ని బాలకృష్ణ తన దినచర్యగా మార్చుకున్నాడు. కొబ్బరిలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మినరల్స్ ను వీటితో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాడు. 

ఎలక్ట్రోలైట్స్ సమతుల్యానికి కొబ్బరి సాయపడుతుంది. పీహెచ్ ను బ్యాలన్స్ చేస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ ను నియంత్రిస్తుంది. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, అచ్చం కొబ్బరి తింటూ అధిక కాలం జీవించి ఉండడం అందరికీ సాధ్యపడదని వైద్యులు అంటున్నారు. కొబ్బరి నీరు తాగుతూ, కేవలం కొబ్బరే తినేవారు పొటాషియం పెరగకుండా చూసుకోవాలన్నది వైద్యుల సూచన. లేదంటే అధిక పొటాషియంతో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు పెరుగుతుందంటున్నారు. (బాలకృష్ణన్ తో షెనాజ్ మాట్లాడిన మాటలు)

GERD
MAN
COCONUT
FOOD
  • Loading...

More Telugu News