Tarakaratna: ఫిలిం ఛాంబర్ కు తారకరత్న భౌతికకాయం తరలింపు... పక్కనే కూర్చున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి

  • మోకిలలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు భౌతికకాయం తరలింపు
  • అంబులెన్సును అనుసరిస్తున్న 200 వాహనాలు
  • సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
Balakrishna and Vijayasai Reddy with Tarakaratna mortal

నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. అంబులెన్సులో ఆయన పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అంతకు ముందే తారకరత్న బాబాయ్ బాలకృష్ణ మోకిలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అంబులెన్సులో తారకరత్న భౌతికకాయం పక్కనే బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మోకిలలోని నివాసం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భౌతికకాయం ఫిలిం ఛాంబర్ కు తరలుతోంది. 

అంబులెన్స్ వెనుక దాదాపు 200 వాహనాలు అనుసరిస్తున్నాయి. 10 గంటలకు పార్థివదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానానికి అంతిమయాత్ర కొనసాగుతుంది. మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలను నిర్వహిస్తారు. మరోవైపు, ఈ ఉదయం 8 గంటలకు తారకరత్న భౌతికకాయానికి ఆయన కుమారుడి చేత అంతిమ క్రతువులను నిర్వహించారు.

More Telugu News