palazzo pant: గోనె సంచితో ప్యాంట్.. బాబోయ్ ఇంత ఖరీదా?!

designer made palazzo pants with sacks
  • గోనె సంచితో తయారు చేసిన పలాజో ప్యాంట్ రూ.60 వేలు
  • ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ‘సచ్ కద్వా హై’ అనే యూజర్
  • లక్షల్లో లైక్ లు.. వేలల్లో కామెంట్లు
ఫ్యాషన్ పేరుతో డిజైనర్లు వింత వింత బట్టలు తయారుచేస్తున్నారు. జనాలు కూడా వాటిని అంతే ఇంట్రెస్టుతో కొనుక్కుని, ధరిస్తున్నారు. ఇలా ఓ డిజైనర్ రూపొందించిన ఓ ప్యాంట్ వైరల్ అవుతోంది. దాని ఖరీదు మరింత షాక్ కు గురి చేస్తోంది. 
 
వడ్లు, బియ్యం తదితరాలు రవాణా చేసేందుకు ఉపయోగించే గోనె సంచితో చేసిన పలాజో ప్యాంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా దాన్ని అమ్మకానికి పెట్టారు. ఒక బట్టల షాపులో మధ్యలో దీనిని ఉంచారు. కానీ ధర చూస్తే ‘బాబోయే ఇంతనా?’ అనేలా ఉంది. వందో, వెయ్యో అనుకుంటున్నారేమో.. అక్షరాలా 60 వేల రూపాయలట. గోనె సంచితో ప్యాంటు తయారు చేయడమే వింతగా ఉంటే.. ఇంత రేటు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. 

ఈ పలాజో ప్యాంట్ ని వీడియో తీసి ‘సచ్ కద్వా హై’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అప్ లోడ్ చేశారు. ‘ఈ పలాజోని రూ.60,000 పెట్టి కొంటారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది లక్షల్లో లైక్ లు.. వేలల్లో కామెంట్లు. ‘ఆ అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారులే!’ అని అనుకోకండి. చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారట. కొత్త ఒక వింత కదా మరి!

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
palazzo pant
Viral Videos
Bori Wala Palazzo
Sachkadwahai
Instagram
designer

More Telugu News