Guinness World Record: నీటి అడుగున 4 నిమిషాల ముద్దుతో గిన్నిస్‌ రికార్డు సాధించిన ప్రేమ జంట

Couple Set Guinness World Record For The Longest Underwater Kiss

  • గతంలో 3 నిమిషాల 24 సెకన్లుగా ఉన్న రికార్డు బద్దలు
  • ప్రేమికుల రోజు నాడు రికార్డు సృష్టించిన జంట
  • మాల్దీవుల్లోని ఓ స్విమ్మింగ్ పూల్ లో దిగి సాహసం

గిన్నిస్ రికార్డు సాధించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఓ ప్రేమ జంట వినూత్నంగా ఆలోచించింది. ప్రేమికుల రోజున తమ పేరును గిన్నిస్‌ రికార్డుల్లో లిఖించుకుంది. ఇందుకోసం వీరు నీటి అడుగున ఎక్కువసేపు ముద్దు పెట్టుకొని రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్ ప్రేమికులు. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మాల్దీవుల్లోని ఇన్ఫినిటీ పూల్‌లోకి దిగిన ఈ జంట 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. దాంతో, 13 ఏళ్ల క్రితం మిచెల్‌, ఎలీసా అనే జంట నెలకొల్పిన 3 నిమిషాల 24 సెకన్ల అండర్‌ వాటర్‌ కిస్‌ రికార్డును వీరు అధిగమించారు . 

బెత్ నీల్, మైల్స్ ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి  చేర్చారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని గిన్నిస్‌ రికార్డ్స్ ప్రతినిధులు వారికి అందజేశారు. ఈ రికార్డు కోసం మూడు రోజులుగా మాల్దీవుల్లోని ఇన్ఫినిటీ పూల్‌లో విరామం లేకుండా ప్రాక్టీస్‌ కూడా చేశామని నీల్, క్లౌటియర్‌ తెలిపారు. ఈ జంటకు ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది.

Guinness World Record
Underwater Kiss
Longest
  • Loading...

More Telugu News