NTR: రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ!

NTR image on hundred rupees coin
  • పూర్తిగా వెండితో రూ.100 నాణెం
  • పురందేశ్వరిని కలిసిన మింట్ అధికారులు
  • నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను ఆమెకు చూపించిన వైనం
  • అధికారులు చూపిన మోడల్ కు పురందేశ్వరి ఓకే

త్వరలో భారత ప్రభుత్వం రూ.100 నాణెం తీసుకువస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారుచేయనున్నారు. ఈ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కలిశారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.

  • Loading...

More Telugu News