Palla Sreenivasa Rao: సజ్జల, విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు

Palla Sreenivasa Rao demands CBI to question Sajjala and Vijayasai Reddy

  • విశాఖలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకం ఆవిష్కరణ
  • గొడ్డలిపోటును విజయసాయి గుండెపోటు అన్నారన్న పల్లా
  • ప్రశాంత్ కిశోర్ ను కూడా విచారించాలని డిమాండ్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య వెనుక కుట్ర ఉందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వివేకా హత్య జరిగిన రోజున వైఎస్ అవినాశ్ రెడ్డి నుంచి జగన్ కు ఫోన్లు వెళ్లాయని చెప్పారు. వివేకాపై గొడ్డలిపోటును గుండెపోటుగా విజయసాయిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజున నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షి పత్రికలో తప్పుడు కథనాన్ని ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను సీబీఐ విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. వివేకా హత్యను ఉపయోగించి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని... వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కూడా ఈ కేసులో విచారించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని పల్లా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Palla Sreenivasa Rao
Telugudesam
Sajjala Ramakrishna Reddy
Vijayasai Reddy
Jagan
YSRCP
YS Vivekananda Reddy
Prashant Kishor
  • Loading...

More Telugu News