Telangana: తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రకటన

Center replies to Uttam Kumar on Telangana state debts

  • తెలంగాణ అప్పులపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్
  • పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్రం
  • తెలంగాణ మొత్తం అప్పులు రూ.4.33 లక్షల కోట్లు అని వెల్లడి

తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది. 2022 అక్టోబరు నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రభుత్వ అప్పులే కాకుండా... రాష్ట్ర సర్కారు పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను కూడా ఇందులో చేర్చారు. 

ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రభుత్వపరంగా రూ.75,577 కోట్ల అప్పులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 2021-22 నాటికి ఆ అప్పుల విలువ రూ.2,83,452 కోట్లు అని తెలిపింది. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.2,07,881 కోట్ల అప్పులు చేసినట్టు తెలిపింది. 

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Telangana
Debts
Parliament
Uttam Kumar Reddy
Union Finance Ministry
  • Loading...

More Telugu News