Cricket: ఫుట్‌బాల్ తెలిసిన వ్యక్తి క్రికెట్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి.. వైరల్ అవుతున్న వీడియో ఇదే!

This is what happens when you bring a guy who also knows how to play football Says Sachin

  • వైరల్ అవుతున్న వీడియోను చూసి ఆశ్చర్యపోతున్న క్రికెటర్లు
  • బౌండరీ బయట పడబోయిన బంతిని కాలితో తన్ని మైదానంలోకి పంపిన ఫీల్డర్ 
  • ఫిదా అవుతున్న అభిమానులు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ కూడా ఆడడం తెలిసిన క్రికెటర్‌ను ఆడిస్తే ఇలానే ఉంటుందంటూ సచిన్ ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా బాదడంతో అది గాల్లోకి లేచి బౌండరీకి ఆవల పడబోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ దానిని అతి కష్టం మీద అందుకున్నప్పటికీ నియంత్రణ కోల్పోవడంతో బౌండరీ లైన్ దాటే ప్రమాదం ఉందని భావించి వెంటనే బంతిని మళ్లీ గాల్లోకి విసిరేశాడు.

ఈ లోపు అతడు బౌండరీ లైన్ దాటేశాడు. బంతి కూడా బౌండరీ లైన్ దాటి కిందపడుతుండడం చూసి మరోమారు అప్రమత్తమయ్యాడు. ఈసారి గాల్లోకి లేచి కాలితో బంతిని బలంగా తన్నాడు. అంతే.. బంతి ఈసారి మైదానంలోకి వచ్చింది. అక్కడే ఉన్న మరో ఫీల్డర్ దానిని అందుకోవడంతో బ్యాటర్ వెనుదిరగక తప్పలేదు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్, మైఖేల్ వాన్, జిమ్మీ నీషమ్ తదితర మాజీ ఆటగాళ్లు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అద్భుతం అని కొనియాడుతున్నారు. ఫుట్‌బాల్ ఆడడం తెలిసిన క్రికెటర్‌ని ఆడిస్తే ఇలానే ఉంటుందంటూ సచిన్ ట్వీట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Cricket
Crime News
Viral Videos
Sachin Tendulkar
  • Loading...

More Telugu News