Life Imprisonment: ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవిత ఖైదు... ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Life Imprisonment for who caught in exam cheatings in Uttarakhand

  • ఇటీవల రిక్రూట్ మెంట్లు, పరీక్షల్లో మోసాలు
  • అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్డినెన్స్
  • గవర్నర్ ఆమోదం

ఇటీవల ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలు, పేపర్ లీక్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం పట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ... పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు తప్పదని హెచ్చరించారు. కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. 

ఉన్నతస్థానానికి ఎదగాలన్న యువత కలలకు, ఆశయాలకు భంగం కలిగించే వ్యవహారాల పట్ల తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడినవారికి జైలు శిక్షలే కాకుండా, వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. రిక్రూట్ మెంట్లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా, గవర్నర్ ఆమోదం కూడా లభించింది.

Life Imprisonment
Exams
Recruitments
Cheating
Fraud
Uttarakhand
  • Loading...

More Telugu News