Anand Mahindra: నాటు నాటు పాటకు రామ్ చరణ్ తో స్టెప్పులేసిన ఆనంద్ మహీంద్రా... వీడియో వైరల్!

Anand Mahindra shake his legs with Ram Charan for Naatu Naatu song

  • హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసు
  • హాజరైన ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్
  • నాటు నాటు పాట స్టెప్పులను మహీంద్రా అధిపతికి నేర్పిన చరణ్
  • వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

హైదరాబాదులో నిన్న జరిగిన ఫార్ములా-ఈ మెయిన్ రేసుకు దేశంలోని చాలామంది సెలెబ్రిటీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రేసును వీక్షించేందుకు వచ్చిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తో కలిసి రేసింగ్ ట్రాక్ వద్ద సందడి చేశారు. 

ఆనంద్ మహీంద్రా... రామ్ చరణ్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. రామ్ చరణ్ వన్, టూ, త్రీ చెబుతుండగా... ఆనంద్ మహీంద్రా ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు. 

హైదరాబాద్ గ్రాండ్ ప్రీ సందర్భంగా తనకు నిజమైన బోనస్ లభించిందని, నాటు నాటు పాటకు సంబంధించి బేసిక్ డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. థాంక్యూ రామ్ చరణ్... మీ నాటు నాటు పాట ఆస్కార్ లో విజేతగా నిలవాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. 

ఈ వీడియోపై రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. "ఆనంద్ మహీంద్రా గారూ... ఈ స్టెప్పులను నాకంటే మీరే త్వరగా నేర్చుకున్నారు" అంటూ ప్రశంసించారు. "మీతో ఎంతో సరదాగా గడిచిపోయింది" అంటూ ట్వీట్ చేశారు. 

అందుకు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ... "మంచిది, ఎందుకంటే మనిద్దరం ఒకే స్కూల్లో (లారెన్స్ లవ్ డేల్) చదువుకున్నాం కాబట్టి. కానీ, నువ్వు ఈ ముసలాడ్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నట్టున్నావు" అంటూ చమత్కరించారు.

Anand Mahindra
Ram Charan
Naatu Naatu
Steps
Formula-E
Hyderabad
  • Loading...

More Telugu News