Bandaru Sathyanarayana: పరిశ్రమలు తీసుకురాలేక కోడి, గుడ్డు అంటున్నారు: మంత్రి అమర్నాథ్ పై బండారు విమర్శలు

  • హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసుకు హాజరైన ఏపీ మంత్రి
  • ఏపీలో కోడి గుడ్డు పెట్టిందన్న అమర్నాథ్
  • అది పెట్ట కావడానికి సమయం పడుతుందని వెల్లడి
  • పరిశ్రమలు తేలేక చేతకాని మాటలు మాట్లాడుతున్నారన్న బండారు 
Bandaru Sathyanarayana slams AP minister Amarnath

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసుకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను మీడియా, ఏపీలో ఎప్పుడు ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహిస్తారని ప్రశ్నించింది. అందుకాయన బదులిస్తూ, ఏపీలో కోడి గుడ్డు పెట్టిందని, అది కోడిపెట్ట కావడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. 

పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వి చేతకాని మాటలు అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణతో ఏపీని పోల్చుతూ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని స్పష్టం చేశారు. 

"ఏపీలో కోడి గుడ్డు పెట్టింది... అది పెట్ట కావడానికి టైమ్ పడుతుందంటున్నారు. పరిశ్రమలు తీసుకురాలేక కోడి, గుడ్డు అంటూ కథలు చెబుతున్నారు. జగన్ పదవిలో ఉన్నంతకాలం ఏపీది అధోగతే" అని బండారు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

More Telugu News