Kanna Lakshminarayana: విశాఖ అయితే దోచుకోవడానికి బాగుంటుందని జగన్ భావిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • అమరావతిలో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందన్న కన్నా 
  • అక్కడైతే తనకేం వస్తుందని సీఎం భావిస్తున్నారని వ్యాఖ్య 
  • విశాఖలో అంతా సిద్ధంగా ఉందన్న కన్నా
  • దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని విమర్శలు
Kanna Lakshmi Narayana slams CM Jagan over AP Capital

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. దోచుకోవడం కోసమే విశాఖ రాజధాని అంటున్నారని ఆరోపించారు. అమరావతి అయితే ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇక్కడ తనకేం వస్తుందని సీఎం అనుకుంటున్నారని విమర్శించారు. విశాఖలో అన్నీ సిద్ధంగా ఉన్నాయని, అలాంటి నగరం అయితే దోచుకోవడానికి బాగుంటుందని జగన్ భావిస్తున్నారని కన్నా అన్నారు.  

వీళ్లను చూసి వైజాగ్ ప్రజలు భయపడుతున్నారని, బాబోయ్ మాకు రాజధాని వద్దు అంటున్నారని తెలిపారు. వైజాగ్ లో భూకబ్జాలు, చెప్పలేనన్ని దారుణాలు, అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు.

అమరావతి విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని చాలామంది అన్నారని, అయితే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకు నిధుల కోసం వెళ్లినప్పుడు కేంద్రం తగిన రీతిలో స్పందిస్తుందని తాను గతంలోనే చెప్పానని కన్నా స్పష్టం చేశారు. ఇప్పుడదే నిజమైందని వెల్లడించారు.

More Telugu News