Ramcharan: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న రామ్ చరణ్.. నార్త్ లో విపరీతంగా పెరుగుతున్న క్రేజ్

12 million followers for Ramcharan in Instagram

  • 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్
  • ఇన్స్టాలో 12 మిలియన్లకు చేరుకున్న ఫాలోయర్ల సంఖ్య
  • ట్విట్టర్ లో 3 మిలియన్ల ఫాలోయర్లు

సినీ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే స్టార్ కిడ్స్ ఎంతో మంది ఉంటారు. అయితే వీరిలో కొందరు మాత్రమే స్వయం ప్రతిభతో ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ హీర్ రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్... కొద్ది కాలంలోనే తన తండ్రి ప్రభావం నుంచి బయటపడి, సొంత టాలెంట్ తో అగ్ర నటుడిగా ఎదిగారు. 

టాలీవుడ్ లో స్టార్ గా వెలుగొందుతున్న చరణ్... 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ సినిమాలో చరణ్ నటన విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు, నార్త్ లోనే కాకుండా, ఇతర దేశాల్లో సైతం చరణ్ ను అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో సైతం చరణ్ దుమ్మురేపుతున్నారు. ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోయర్స్ సంఖ్య 12 మిలియన్లకు చేరుకుంది. వాస్తవానికి సోషల్ మీడియాలో చరణ్ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. చాలా తక్కువ పోస్టులు పెడుతుంటారు. అయినప్పటికీ... ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ట్విట్టర్ లో కూడా చరణ్ కు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. 

టాలీవుడ్ లో ఇతర హీరోల విషయానికి వస్తే... ఇన్స్టాలో అల్లు అర్జున్ 19.9 మిలియన్ల ఫాలోయర్లతో తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో విజయ్ దేవరకొండ 17.8 మిలియన్ల ఫాలోయర్లతో నిలిచారు.

Ramcharan
Tollywood
Bollywood
Social Media
Instagram
Twitter
  • Loading...

More Telugu News