Whatsapp: ఒకేసారి 100 ఫైళ్లు పంపుకోవచ్చు... వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఇప్పటిదాకా 30 మీడియా ఫైళ్లు మాత్రమే పంపుకునే వెసులుబాటు
 - ఫైళ్ల పరిమితిని 100కి పెంచిన వాట్సాప్
 - ఇకపై మరిన్ని ఫొటోలు పంపుకునేందుకు వీలు
 - ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే!
 - త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి!
 
        ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. వాట్సాప్ యూజర్లు ఇకపై 100 మీడియా ఫైళ్లను ఒకేసారి పంపుకోవచ్చు. ఇప్పటిదాకా మీడియా 30 ఫైళ్లను మాత్రమే షేర్ చేసే వీలుండేది. ఇప్పుడా పరిమితిని 100కి పెంచింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ఐఓఎస్ యూజర్లకు కూడా అందించనున్నారు. 
కాగా, ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్ అనేబుల్ కాకపోతే, ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ (2.23.4.3)కి అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. ఒకేసారి మరిన్ని ఫొటోలు, ఇతర మీడియా ఫైళ్లు పంపుకోవడానికి ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది.