JEE Main 2023: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలంటే..!

NTA Released JEE Main Session 1 Results

  • జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన తొలి విడత పరీక్షలు
  • ఎన్‌టీఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లడం ద్వారా పరీక్ష ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే సరి
  • ఏప్రిల్ 6 నుంచి జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు

జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి సెషన్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశానికి సంబంధించి జాయిట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మొయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగాయి. జేఈఈ చరిత్రలోనే తొలిసారి 95.8 శాతం మంది అంటే 8.22 లక్షల మంది హాజరయ్యారు. 

తాజాగా, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వీటి ఫలితాలను విడుదల చేసింది. jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా, జేఈఈ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 12 వరకు జరగనున్నాయి. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3న విడుదల చేయనుండగా, చివరి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.

JEE Main 2023
JEE Results
NTA
  • Loading...

More Telugu News