Bobbysimha: 'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!

Vasantha Kokila Trailer Relesaed
  • బాబీసింహా - ఆర్య కాంబినేషన్లో రూపొందిన 'వసంత కోకిల'
  • సస్పెన్స్ తో నడిచే యాక్షన్ థ్రిల్లర్ ఇది
  • బాబీసింహాను ప్రశంసించిన చిరంజీవి 
  • మూడు భాషల్లో ఈ నెల 10వ తేదీన సినిమా రిలీజ్

బాబీసింహా .. కశ్మీర పరదేశి జంటగా 'వసంతకోకిల' సినిమా రూపొందింది. రామ్ తాళ్లూరి - బాబీసింహా కలిసి నిర్మించిన సినిమా ఇది. రొమాన్స్ టచ్ తో .. సస్పెన్స్ తో నడిచే యాక్షన్ థ్రిల్లర్ ఇది. తెలుగులో ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. 

చిరంజీవితో కలిసి బాబీసింహా 'వాల్తేరు వీరయ్య' సినిమా చేశాడు. అప్పటి నుంచి మెగాస్టార్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందువలన ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి, దానిని గురించి స్పందించారు. "ఈ ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది" అన్నారు. 

" ఈ సినిమా కథ .. ఒకరాత్రి జరిగే సంఘటనలతో నడుస్తుంది. ఆర్య కూడా ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రను పోషించాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. తప్పకుండా మీరంతా ఆశిస్తున్న వినోదాన్ని ఈ సినిమా పంచుతుంది. పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News