Mahesh Babu: మేనల్లుడికి ఆశీస్సులు అందించిన మహేశ్ బాబు

Mahesh Babu wishes Ashok Galla all the best for his second movie

  • రెండో చిత్రం చేస్తున్న అశోక్ గల్లా
  • అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చిత్రం
  • నేడు హైదరాబాదులో ప్రారంభం
  • కెమెరా స్విచాన్ చేసిన నమ్రత
  • క్లాప్ కొట్టిన విక్టరీ వెంకటేశ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా రెండో చిత్రం నేడు ప్రారంభమైంది. ఈ చిత్రం ముహూర్తం షాట్ నేడు హైదరాబాద్ లో చిత్రీకరించారు. నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. బోయపాటి గౌరవ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.  

కాగా, తన మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం చేస్తున్నందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. నీ కొత్త సినిమాకు బెస్టాఫ్ లక్ అశోక్. నీ ప్రతి సినిమా విజయం సాధించాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు.

Mahesh Babu
Ashok Galla
New Movie
Namrata
Venkatesh
Boyapati Sreenu
Arjun Jandhyala
  • Loading...

More Telugu News