Kakatiya University: వాట్సాప్‌లో డిగ్రీ ఇంటర్నల్ ప్రశ్నపత్రం.. ఫోన్‌లో చూస్తూ పరీక్ష రాసిన విద్యార్థులు

Adilabad Govt Science Degree College Shares Question Paper In Whatsapp
  • కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంటర్నల్ పరీక్షలు
  • ప్రశ్న పత్రాన్ని వాట్సాప్‌లో షేర్ చేసిన డిగ్రీ కాలేజీ
  • ప్రింటర్ పాడవడం వల్లేనన్న ప్రిన్సిపల్
ప్రింటర్ పాడవడంతో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో విద్యార్థులకు పంపించి పరీక్ష రాయించింది ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. 20 మార్కుల ఈ పరీక్షను కూడా మామూలుగానే నిర్వహించాలి. అయితే, ప్రింటర్ పాడైందన్న కారణంతో ఆదిలాబాద్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విద్యార్థులకు నిన్న వాట్సాప్‌లో ప్రశ్న పత్రం పంపించారు. 

విద్యార్థులు దానిని తమ స్మార్ట్‌ఫోన్లలో చూసి జవాబులు రాస్తూ కనిపించారు. సెల్‌ఫోన్ దగ్గరుంటే కాపీ కొట్టరా? అన్న ప్రశ్నకు ప్రిన్సిపల్ జగ్‌రాం అంతర్బేది మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పరీక్ష రాయించామని, వారిపై ఓ కన్నేసి ఉంచామని పేర్కొన్నారు.
Kakatiya University
Govt Science Degree College
Adilabad
Whatsapp

More Telugu News