Nara Lokesh: లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం

Nara Lokesh Prachara Ratham Siezed

  • పలమనేరులో కొనసాగుతున్న పాదయాత్ర
  • అనుమతి లేదంటూ లోకేశ్ ప్రచారరథాన్ని సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం
  • పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 7వ రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు యత్నించారు. అనుమతులు లేకుండానే వాహనాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు. 

ఈ సందర్భంగా పోలీసుల యత్నాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి, ప్రచార రథాన్ని వదిలేశారు. మరోవైపు లోకేశ్ ఏడో రోజు యాత్ర పలమనేరులోని రామాపురం నుంచి ప్రారంభమయింది. క్యాంప్ సైట్ వద్ద ఎంసీ పాలెంకు చెందిన 20 మంది యువత, రంగాపురంకు చెందిన 20 కుటుంబాలు, పలమనేరు పెద్ద మసీదు వీధికి చెందిన 20 ముస్లిం కుటుంబాలు, మాజీ సర్పంచ్ టీడీపీలో చేరారు.

Nara Lokesh
Telugudesam
Prachara Ratham
Palamaneru
  • Loading...

More Telugu News