drone: శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం

Military Drone Caught In Fisherman Net At Santhabommali Srikakulam
  • సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు కనిపించిన డ్రోన్
  • మెరైన్ అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు
  • డ్రోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్న అధికారులు
శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ కలకలం సృష్టించింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఈ డ్రోన్ కనిపించడంతో మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్కడికి చేరుకుని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

విమానం ఆకారంలో ఉన్న ఈ డ్రోన్ సుమారు 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువు ఉందని చెప్పారు. దీనిపై సీ టార్గెట్ అనే అక్షరాలు, 8001 నంబర్ రాసి ఉందని అధికారులు తెలిపారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు. రక్షణ శాఖ క్షిపణి ప్రయోగ సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు.

ఈ తరహా డ్రోన్లను వాతావరణ శాఖ, అంతరిక్ష పరిశోధనలలో శాస్త్రవేత్తలు వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ కు ఎలాంటి కెమెరాలు లేకపోవడం, రేడియో సిగ్నల్స్ పంపే పరికరాలు ఉండడంతో దీనిని ఎవరు, ఎందుకోసం ప్రయోగించారనేది సస్పెన్స్ గా మారింది.
drone
Srikakulam District
sea
foreign
fishermen

More Telugu News