India: మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్: ఇంగ్లండ్ ను 68 పరుగులకే కుప్పకూల్చిన భారత్

Indian girls scalps England for 68 runs

  • దక్షిణాఫ్రికాలో మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్
  • పోచెఫ్ స్ట్రూమ్ లో నేడు ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • సమష్టిగా సత్తా చాటిన బౌలర్లు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. పోచెఫ్ స్ట్రూమ్ లో జరుగుతున్న టైటిల్ పోరులో భారత అమ్మాయిలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ ను సద్వినియోగం చేసుకుని ఇంగ్లండ్ ను 68 పరుగులకే కుప్పకూల్చారు. 

భారత బౌలర్లలో తితాస్ సాధు 2, అర్చనా దేవి 2, పర్శవి చోప్రా 2, మన్నత్ కశ్యప్ 1, కెప్టెన్ షెఫాలీ వర్మ 1, సోనమ్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ పతనంలో పాలుపంచుకున్నారు. 

ఇంగ్లండ్ జట్టులో రయానా మెక్ డొనాల్డ్ అత్యధికంగా 19 పరుగులు చేసింది. నిమా హోలాండ్ 10, అలెక్సా స్టోన్ హౌస్ 11, సోఫియా స్మేల్ 11 పరుగలు చేశారు.

India
England
Under-19 World Cup
T20
  • Loading...

More Telugu News