Nandamuri Tarakaratna: లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన నందమూరి తారకరత్న.. ఆసుపత్రికి వెళ్లిన బాలకృష్ణ

Nandamuri Tarakaratna fell unconscious in Nara Lokesh padayatra
  • కుప్పంలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న
  • పాదయాత్రలో నడుస్తున్న సమయంలో సొమ్మసిల్లిన వైనం
  • కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో చికిత్స
సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం... మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువయింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో తారకరత్నతో పాటు బాలకృష్ణ ఉన్నారు.
Nandamuri Tarakaratna
Nara Lokesh
Telugudesam
Yuva Galam
Health

More Telugu News