Kangana Ranaut: 'పఠాన్' మూవీపై కంగనా రనౌత్ స్పందన

Kangana Ranaut response on Pathan Movie
  • బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న 'పఠాన్' మూవీ
  • తొలిరోజే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు
  • బాలీవుడ్ గాడిన పడుతుందన్న కంగన

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకుణేల తాజా చిత్రం 'పఠాన్' అనేక వివాదాల మధ్య విడుదలై, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిట్ కావడంతో బాలీవుడ్ లో సంతోషం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ... ఈ సినిమా విజయవంతంగా నడుస్తోందని, ఇలాంటి సినిమాలు కచ్చితంగా ఆడతాయని చెప్పింది. ప్రస్తుతం ఇతర సినీ పరిశ్రమల కంటే వెనుకబడిన బాలీవుడ్... ఈ సినిమా హిట్ తో మళ్లీ గాడిన పడుతుందని తెలిపింది. మరోవైపు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ... భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పఠాన్ ఘన విజయం సాధించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News