Sharwanand: ఘనంగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్.. హాజరైన రామ్ చరణ్ దంపతులు.. ఫొటోలు ఇవిగో

Ram Charan attends Sharwanand engagement

  • అంగరంగ వైభవంగా శర్వానంద్, రక్షితారెడ్డిల నిశ్చితార్థం
  • హైదరాబాదులోని ఓ హోటల్ లో ఎంగేజ్ మెంట్ వేడుక
  • శర్వ, రక్షిత జంటకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హీరో శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. రక్షితారెడ్డితో ఆయన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి నేపథ్యంలో సినిమాలకు శర్వానంద్ కొంత బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Sharwanand
Tollywood
Engagement
Ram Charan
  • Loading...

More Telugu News