keerthi suresh: మరోసారి చర్చల్లోకి ‘కీర్తి సురేష్’ వివాహం

keerthi suresh relationship with businessman

  • చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందన్న వార్తలు
  • అతడికి కేరళలో వ్యాపారాలున్నట్టు సమాచారం
  • నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకునే యోచనతో ఉన్నారంటూ ప్రచారం

అందాల కథానాయిక కీర్తి సురేష్ వివాహంపై మరోసారి కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ (సహజీవనం)లో ఉందని, నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా ప్రచారమవుతున్న సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనంతరం వ్యాపారవేత్తతో ఆమె వివాహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఆమె పెళ్లికి సంబంధించి కల్పిత కథనాలు, ఊహాగానాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. దీనిపై కీర్తి సురేష్ ఇంత వరకు స్పందించలేదు. ఈ ప్రచారంలో నిజం పాళ్లు ఎంతన్నది ఆమె స్వయంగా చెబితేనే తెలుస్తుంది.

keerthi suresh
relationship
businessman
marriage
  • Loading...

More Telugu News