UFO: తుర్కియేలో ఫ్లైయింగ్ సాసర్ మేఘం.. వీడియో ఇదిగో!

Bizarre UFO Like Cloud Formation Over Turkey Stuns Internet

  • ఈ వింత మేఘాన్ని వీడియో తీసి నెట్ లో పెట్టిన బుర్సా పౌరులు
  • ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిన వీడియో
  • పర్వత ప్రాంతాల్లో అరుదుగా ఇలాంటి మేఘాలు ఏర్పడతాయన్న నిపుణులు
  • గాలుల వేగంలో వచ్చే అసాధారణ మార్పులే కారణమని వివరణ

తుర్కియే (టర్కీ) లోని బుర్సా పట్టణంలో గురువారం ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఉదయంపూట ఆకాశంలో ఓ పెద్ద ఫ్లైయింగ్ సాసర్ కనిపించడంతో బుర్సా వాసులు ఆశ్చర్యపోయారు. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయాందోళనకు లోనయ్యారు. కాసేపటి తర్వాత ఆకాశంలో కనిపిస్తున్నది ఫ్లైయింగ్ సాసర్ కాదని తేలిపోయింది. ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారం దాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ వింతను తమ కెమెరాలలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై తుర్కియే మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి మేఘాలు 2 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు. గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు. ఈ మేఘాలు కనిపించాయంటే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు వర్షం కురుస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News