Anant Ambani: వైభవంగా అంబానీ చిన్న కుమారుడి నిశ్చితార్థం

Anant Ambani engagement with Radhika held in Mumbai
  • అంబానీ ఇంట శుభకార్యం
  • ముంబయిలో అనంత్, రాధిక నిశ్చితార్థ వేడుక
  • గుజరాతీ సంప్రదాయాల ప్రకారం కార్యక్రమం
  • ఉంగరాలు మార్చుకున్న అనంత్, రాధిక
భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ నిశ్చితార్థం ముంబయిలో ఘనంగా జరిగింది. వీరేన్ మర్చంట్, శైలా దంపతుల కుమార్తె రాధిక మర్చంట్ తో అనంత్ నిశ్చితార్థ వేడుక కన్నులపండుగలా సాగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు, వివిధ రంగాల ప్రముఖులు కూడా విచ్చేశారు. 

ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా తొలుత వీరేన్ మర్చంట్ నివాసానికి వెళ్లి లాంఛనంగా వారిని ఆహ్వానించింది. అనంతరం తమ నివాసానికి వచ్చిన మర్చంట్ కుటుంబ సభ్యులను అంబానీలు ఘనంగా ఆహ్వానించారు. అక్కడ్నించి అనంత్, రాధిక శ్రీకృష్ణ మందిరంలో తమ కుటుంబసభ్యుల ఆశీస్సులు అందుకుని నిశ్చితార్థ వేదికపైకి వచ్చారు. తొలుత విఘ్నేశ్వరుడి పూజలు నిర్వహించారు. లఘ్నపత్రికను అందరికీ చదివి వినిపించారు. 

ఈ నిశ్చితార్థ వేడుకలో గుజరాతీ సంప్రదాయాలను పాటిస్తూ, అంబానీ, మర్చంట్ కుటుంబ సభ్యులు కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఆపై అనంత్, రాధిక ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం పూర్తయింది. రాధిక బంగారు జరీ లెహెంగా ధరించగా, అనంత్ నేవీ బ్లూ కుర్తా, డార్క్ హ్యూ జాకెట్ తో దర్శనమిచ్చారు. వీరి వివాహం ఈ ఏడాదే జరగనుందని తెలుస్తోంది.
Anant Ambani
Radhika
Engagement
Mumbai

More Telugu News