Anikha Surendran: అందాల 'బుట్టబొమ్మ'గా అనిఖ సురేంద్రన్ .. లేటెస్ట్ పిక్స్!

Anikha Surendran Speciial

  • చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖ పాప్యులర్ 
  • టీనేజ్ బ్యూటీగా తెలుగు తెరకి పరిచయం 
  • ఈనెల 26వ తేదీన రానున్న 'బుట్టబొమ్మ'
  • లేటెస్ట్ ఫొటోల్లో ముద్దబంతిలా మురిపిస్తున్న బ్యూటీ  

అనిఖ సురేంద్రన్ .. తమిళనాట ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనిఖ కేరళకి చెందిన అమ్మాయి .. 2007లోనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మలయాళంతో పాటు తమిళంలోను చైల్డ్ ఆర్టిస్టుగా బిజీ అయింది. తమిళంలో అజిత్ హీరోగా చేసిన సినిమా (ఎంతవాడుగానీ)తో ఆమె పాప్యులర్ అయింది. ఇక 'విశ్వాసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక అవార్డులను గెలుచుకున్న అనిఖ, టీనేజ్ లోకి అడుగుపెట్టింది. దాంతో ఆమెతో హీరోయిన్ సినిమాలు చేయడానికి మేకర్స్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హీరోయిన్ గా తెలుగులో 'బుట్టబొమ్మ' సినిమా రూపొందింది. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను , ఈ నెల 26వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన అనిఖ లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో ఎల్లో అండ్ పికాక్ గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్ లో తళుక్కుమంటోంది. ఆకర్షణీయమైన నవ్వుతో మనసులను దోచుకుంటూ, నిజంగానే 'బుట్టబొమ్మ'ను తలపిస్తోంది. చూడబోతే ఈ సినిమాతో ఇక్కడి యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలానే ఉంది మరి.

Anikha Surendran
Arjundas
Buttabomma Movie
  • Loading...

More Telugu News