nityamenan: ప్రభుత్వ పాఠశాలలో నిత్యా మీనన్ పాఠాలు.. వీడియో ఇదిగో!

Heroine Nithya Menon Teach Telugu Lessons In Government School

  • షూటింగ్ బ్రేక్ లో స్కూలును సందర్శించిన నటి
  • విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించిన నిత్య 
  • కొత్త ఏడాది మొదటిరోజు ఇలా పిల్లలతో గడిచిందంటూ కామెంట్

సినీ నటి నిత్యామీనన్ ఇంగ్లిష్ టీచర్ గా మారిపోయారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు.. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని స్కూల్ కు వెళ్లిన నిత్య ఇలా టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. (ఇన్ స్టా వీడియో లింక్)

ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం నిత్యామీనన్ కృష్ణాపురం (ఏపీ, తెలంగాణలలో ఏ రాష్ట్రంలోని గ్రామం అనేదాంట్లో స్పష్టత లేదు) అనే గ్రామానికి వచ్చారు. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లిష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు.

ఇదంతా రికార్డు చేసి నిత్యామీనన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో కొత్త ఏడాదిలో మొదటిరోజు ఇలా గడిచిపోయిందని కామెంట్ జోడించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిత్యాను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారంటూ కితాబునిస్తున్నారు.

nityamenan
Heroine
school teacher
krishnapuram
Instagram
nitya vedeo
  • Loading...

More Telugu News