Revanth Reddy: ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy reacts on CM KCR remarks in BRS meeting

  • ఖమ్మం సభలో కేసీఆర్ ప్రసంగం
  • మోదీని రక్షించడానికే కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేశారన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ గుజరాత్ లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీసిన వైనం

ఖమ్మంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతానన్న కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. 

మోదీని రక్షించడానికే కేసీఆర్ కాంగ్రెస్ పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు నిజంగానే బీజేపీని ఓడించాలనే కోరిక ఉంటే, వెళ్లి గుజరాత్ లో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. బీజేపీ చెర నుంచి దేశాన్ని విడిపిస్తామని చెబుతున్న కేసీఆర్... హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. 

సంవత్సరాల తరబడి మోదీతో కేసీఆర్ అంటకాగారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మోదీ అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు పరిశ్రమలను తీసుకువచ్చింది కాంగ్రెస్ సర్కారేనని తెలిపారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మితమయ్యాయని వివరించారు.

Revanth Reddy
KCR
Congress
Narendra Modi
BJP
BRS
Khammam
  • Loading...

More Telugu News