Lucknow: బహిరంగంగా స్కూటీపై రొమాన్స్.. జంట కోసం పోలీసుల వేట

Lucknow police searching for couple after video of them romancing on scooty goes vira
  • యూపీలోని హజరత్ గంజ్ లో చోటుచేసుకున్న ఘటన
  • ప్రియుడు స్కూటీ నడుపుతుంటే రెచ్చిపోయిన ప్రియురాలు
  • సీసీటీవీ కెమెరాల సాయంతో జంటను పట్టుకునేందుకు పోలీసుల చర్యలు
ఎవరేమనుకుంటే నాకేంటి? ఇలా భావించే కొందరు సమాజ కట్టుబాట్లు, పద్ధతులను పట్టించుకోరు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ యువ జంట బహిరంగంగా శృంగార చేష్టలకు దిగింది. అది కూడా నడి రోడ్డుపైనే. ప్రియుడు స్కూటర్ నడుపుతుంటే, అతడిని కౌగిలించుకుని ఒళ్లో కూర్చున్న ప్రియురాలు ముద్దులు పెడుతోంది. వెనుక వస్తున్న వాహనదారులలో ఒకరు ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలల్లోకి చేరి పెద్ద సంచలనంగా మారింది. దీంతో లక్నో పోలీసులు ఈ జంటను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు.  

లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో నిజమైనదేనని నిర్ధారించారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ కెమెరాల సాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మోటారు వాహనాల చట్టం, అసభ్యతను వ్యాపింపజేస్తున్నందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. 


Lucknow
couple
romance on scooty
police
searching

More Telugu News