Nagababu: అంబటి రాంబాబు డ్యాన్స్ పై నాగబాబు సెటైర్.. అదే స్థాయిలో స్పందించిన అంబటి

Nagababu satires on Ambati Rambabu dance

  • భోగి పండుగ రోజున డ్యాన్స్ చేసిన అంబటి
  • పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే మహత్తరంగా ఉండేదని నాగబాబు ఎద్దేవా
  • తాను ప్యాకేజీల కోసం డ్యాన్స్ చేయను అన్న అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల సందర్భంగా బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరిగాయి. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అంబటి సరదాగా గడిపారు. తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. 

మరోవైపు అంబటి పోస్టుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. 'సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది' అని ఎద్దేవా చేశారు.

నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.

Nagababu
Tollywood
Janasena
Ambati Rambabu
YSRCP
  • Loading...

More Telugu News