RGV: హలో పవన్ కల్యాణ్ గారూ... కొంచెం మీ అన్నయ్యను చూసుకోండి!: రామ్ గోపాల్ వర్మ

RGV tweets a video about Pawan Kalyan and Nagababu

  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన వర్మ
  • నాగబాబు తనకు ముఖ్యం కాదని వెల్లడి
  • పవన్ మీద ఓ అభిమానిగా ట్వీట్లు చేసినట్టు వివరణ
  • అవి అర్థంకాకపోవడం పవన్ దురదృష్టం అంటూ వ్యాఖ్యలు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పోస్టు చేశారు. నేరుగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఈ వీడియోను పంచుకున్నారు. హలో పవన్ కల్యాణ్ గారు... కొంచెం మీ అన్నయ్య (నాగబాబు)ను చూసుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశారు. 

"కొణిదెల నాగబాబు గారు ఆయన అన్నయ్య (చిరంజీవి)కి, ఆయన తమ్ముడు (పవన్ కల్యాణ్)కు ముఖ్యమైన వ్యక్తి కావొచ్చేమో కానీ నాకు కాదు. నేను పవన్ కల్యాణ్ మీద కానీ, జనసేన మీద కానీ చేసిన ట్వీట్లు పవన్ కల్యాణ్ అభిమానిగా చేశాను. అవి అర్థంకాకపోవడం నా దురదృష్టం... నాకంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టం. తన అన్నయ్య కాబట్టి ఇలాంటి వారిని సలహాదారులుగా పెట్టుకుంటే పవన్ కల్యాణ్ కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది ప్రజలే చెబుతారు" అంటూ వర్మ తన వీడియోలో పేర్కొన్నారు.

RGV
Ram Gopal Varma
Pawan Kalyan
Nagababu
Janasena
  • Loading...

More Telugu News