Terrorists: ఢిల్లీలో వ్యక్తిని హత్య చేసి ఆ వీడియోను పాకిస్థాన్ పంపిన ఉగ్రవాదులు!

Alleged terrorists killed man and sent the video to abroad

  • తలనరికి, శరీరాన్ని ముక్కలు చేసిన దుండగులు
  • విదేశాల్లో ఉన్నవారికి వీడియో పంపిన వైనం
  • ఓ ఐఎస్ఐ ఏజెంటుకు కూడా వీడియో పంపినట్టు భావిస్తున్న పోలీసులు
  • ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వారు ఓ వ్యక్తిని హత్య చేసి, తల నరికి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వీడియోగా చిత్రీకరించారని, ఆ వీడియోను వారు విదేశాల్లో ఉన్నవారికి పంపారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోను పాకిస్థాన్ లోని ఐఎస్ఐ ఏజెంటుకు కూడా పంపినట్టుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

వాయవ్య ఢిల్లీలోని భల్ స్వా డెయిరీ ప్రాంతంలో మృతదేహం విడిభాగాలను పోలీసులు కనుగొన్నారు. అంతేకాదు, అరెస్ట్ అయిన ఉగ్రవాదుల సెల్ ఫోన్ నుంచి వీడియోను కూడా సేకరించారు. 

కాగా, హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉంది. అతడికి ఒకచేతిపై త్రిశూలం టాటూ ఉందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, అరెస్ట్ అయిన ఉగ్రవాదులను జగ్జీత్ సింగ్ జస్సా అలియాస్ యాకూబ్ (29), నౌషాద్ (14)గా గుర్తించారు. వారి నుంచి 3 పిస్టళ్లు, 22 కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు.

Terrorists
Murder
Video
Abroad
New Delhi
Police
  • Loading...

More Telugu News