Andhra Pradesh: పదో తరగతి, డిగ్రీ అర్హతతో ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ లో ఉద్యోగాలు

Vijayawada SSA Recruitment 2023 for 60 Posts

  • ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 60 ఉద్యోగాల భర్తీ
  • జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
  • ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలన్న అధికారులు

సమగ్ర శిక్షా అభియాన్ లో వివిధ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించే ఈ ఉద్యోగాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెలాఖరులోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీలు..
జూనియర్ అసిస్టెంట్ : 13
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 10
ఆఫీస్ సబార్డినేట్ : 14

అర్హతలు..
పోస్టును బట్టి పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. 
కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్‌ తప్పనిసరి.
తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
2022 నవంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు)
 
దరఖాస్తు విధానం..
ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్ సైట్  https://apssa.aptonline.in లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి (మినహాయింపు లేదు)

ఎంపిక విధానం..
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి మార్కుల ప్రాతిపదికగా, ఇతర పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడిస్తారు. 

జీతభత్యాలు..
జూనియర్ అసిస్టెంట్ కు రూ.23,500, డేటా ఎంట్రీ ఆపరేటర్ కు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ కు రూ.15,000లు జీతంగా చెల్లిస్తారు.

  • Loading...

More Telugu News