BRS: ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు.. ఖమ్మం సభకు ఏపీ నుంచి జనసమీకరణ

  • గుంటూరు, విజయవాడ సహా పలు నగరాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
  • ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ పేరిట ఏర్పాటు
  • ఖమ్మంలో ఈ నెల 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
BRS Flexis and Hoardings In AP Cities and Towns

సంక్రాంతి పండుగకు శుభాకాంక్షలు చెబుతూ ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం సహా పలు పట్టణాలు, నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింగులలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు కూడా ఉన్నాయి. 

కాగా, ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. ఈ సభ కోసం ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News