Samantha: మరో పోస్టుతో అందరినీ ఆకర్షించిన సమంత

Samantha garners attention with Instagram post

  • మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
  • ఇటీవల సోషల్ మీడియాకు దూరం
  • మళ్లీ యాక్టివ్ గా పోస్టులు పెడుతున్న సమంత
  • తన పెంపుడు కుక్కతో తాజా పోస్ట్ వైరల్

నటి సమంత ఇటీవల సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినా అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది. మయోసైటిస్ రుగ్మత బారినపడిన సమంత ఇటీవల కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరమైంది. గత కొన్నిరోజులుగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు కూడా అందరినీ ఆకర్షిస్తోంది. సమంత సోఫాలో పడుకుని ఉండగా, పెంపుడు కుక్క ఆమె వీపుపై కాలు ఆన్చి దర్శనమిస్తోంది. దీనికి సామ్ పెట్టిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. "బాధపడకు మమ్మీ... నీకు నేనున్నాగా!" అంటూ ఆ శునకం భరోసా ఇస్తున్నట్టుగా ఉందని ఆ ఫొటోకు అనుగుణంగా సమంత క్యాప్షన్ ఇచ్చింది. 

సమంత నటించిన 'శాకుంతలం' చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె పలు చిత్రాలు అంగీకరించినప్పటికీ, అనారోగ్యం కారణంగా వాటి చిత్రీకరణ ఆలస్యమవుతోంది.

Samantha
Actress
Social Media
Instagram
Tollywood
  • Loading...

More Telugu News