Ram Charan: తారక్ తాతగారు, మా నాన్నకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది: రామ్ చరణ్

Ram Charan opines on healthy competition between Mega family and NTR family

  • ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్
  • అమెరికాలో సందడి చేస్తున్న చిత్రబృందం
  • ఎన్టీఆర్ ఫ్యామిలీతో పోటీ గురించి చెప్పిన రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ దిశగా ఉరకలు వేస్తున్న నేపథ్యంలో, దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు తమ కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో సందడి చేస్తున్నారు. కొన్నిరోజుల కిందటే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో చిత్రబృందం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబంతో మెగా పోటీ గురించి ప్రస్తావించారు. 

తారక్ తాత గారు (ఎన్టీ రామారావు), తన తండ్రి చిరంజీవికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని అన్నారు. 30 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉందని తెలిపారు. మెగా ఫ్యామిలీలోనే ఏడుగురు నటులం ఉన్నాం.... కజిన్స్ తో కూడా పోటీ ఉంటుంది అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి తనను, తారక్ ను ఎంపిక చేశారని, తారక్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నానని వెల్లడించారు.

Ram Charan
Mega Family
NTR Family
Jr NTR
RRR
Tollywood
  • Loading...

More Telugu News