Realme 10: అందుబాటు ధరకే రియల్ మీ 10

Realme 10 launched in India for Rs 13999 Specifications top features and more
  • రూ.13,999 నుంచి ధరలు ప్రారంభం
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • బ్యాంక్ కార్డుపై 10 శాతం తగ్గింపు
  • రియల్ మీ 10 ప్రో, 10 ప్రో ప్లస్ సైతం విడుదల

రియల్ మీ 10 4జీ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. అలాగే, రియల్ మీ 10 ప్రో, రియల్ మీ 10 ప్రో ప్లస్ ఫోన్లను సైతం సంస్థ విడుదల చేసింది. రియల్ మీ 10, 4జీ లో 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ ధర రూ.13,999. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీ ధర రూ.16,999. ఈ నెల 15న ఫ్లిప్ కార్ట్ తో పాటు, రియల్ మీ పోర్టల్ పై అమ్మకాలు మొదలవుతాయి. బ్యాంక్ కార్డుపై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. రియల్ మీ 10ప్రో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,999 కాగా, రియల్ మీ 10 ప్రో ప్లస్ ధర రూ.24,999 నుంచి ప్రారంభం అవుతుంది. 


రియల్ మీ 10 4జీ ఫోన్లో 90 హెర్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్, మీడియాటెక్ జీ99 చిప్ సెట్, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా, మరో రెండు సెన్సార్లు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 33 వాట్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. 1 నుంచి 50 శాతం రీచార్జ్ ను కేవలం 28 నిమిషాల్లో చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News