Vidadala Rajini: వైద్యశాఖలో 47 వేల పోస్టులు భర్తీ చేశాం: ఏపీ మంత్రి విడదల రజని

Minister Vidadala Rajini says 47000 posts fulfilled in medical dept

  • విశాఖలో వైద్య శాఖ ప్రాంతీయ సమావేశం
  • హాజరైన మంత్రి విడదల రజని
  • త్వరలో ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి
  • 104 ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు
  • రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇవాళ విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీలో త్వరలో ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 104 వాహనాల ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందించనున్నట్టు తెలిపారు. 

వైద్య శాఖలో 47 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతం చింతూరులో 26 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిపినట్టు మంత్రి వివరించారు. 

తన పర్యటనలో భాగంగా విడదల రజని విజయనగరంలో మెడికల్ కాలేజి నిర్మాణాన్ని పరిశీలించారు. పనుల తీరు, నిర్మాణ సామగ్రిపై ఆమె అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, విజయనగరంలో రూ.500 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

Vidadala Rajini
Medical Dept
Visakhapatnam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News