Woman: ఢిల్లీ మెట్రోలో ఈ యువతి చేష్టలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Woman dances on seat swings using handrail in Delhi Metro Video irks people

  • ఖాళీగా ఉన్న మెట్రోలో రెచ్చిపోయిన యువతి
  • యోగాసనాలు, విన్యాసాలతో కేరింతలు
  • మధ్యలో సీటు ఎక్కి డ్యాన్స్ లు
  • అలా చేయకు అపర్ణా అంటూ నెటిజన్ల సలహా

వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణానికి వారధి అయిన ఢిల్లీ మెట్రోను కొందరు ఆకతాయిలు వివిధ విన్యాసాలకు కేంద్రంగా మలుచుకుంటున్నారు. ఇదే మాదిరి ఓ యువతి ఖాళీగా ఉన్న మెట్రో రైలు బోగీలో తనకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శించింది. అంతేకాదు ఈ విన్యాసాలను ఓ వీడియోగా తీయించి ‘అపర్ణ దేవయాల్‘ పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది ఆమె ఇన్ స్టా గ్రామ్ ఖాతాయే. 

మెట్రోలో ప్రయాణికులు కింద పడిపోకుండా పట్టుకునేందుకు ఆధారంగా ఉండే హ్యాండ్ రెయిలర్లను చేత్తో పట్టుకుని అటూ, ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిపోయింది. మధ్యలో యోగసనాలు వేసింది. ఆ తర్వాత మెట్రోలో సీట్ పైకి ఎక్కి డ్యాన్స్ చేసింది. ఎవరైనా వస్తున్నారా అంటూ మధ్య మధ్యలో అటూ ఇటూ గమనించడం వీడియోలో చూడొచ్చు. మొత్తానికి మెట్రోను ఇల్లుగా మార్చుకున్న ఈ యువతి విషయంలో యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అపర్ణా ఇలాంటివి చేయకు. చూసిన వారు కూడా ఇలానే చేస్తారు. దయచేసి సానుకూలంగా అర్థం చేసుకో’’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. (వీడియో కోసం)

Woman
dances
swings
Video
Delhi Metro
  • Loading...

More Telugu News