Chetan Sharma: బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా మరోసారి చేతన్ శర్మ నియామకం

Chetan Sharma retained selection committee chairman post
  • గత డిసెంబరుతో ముగిసిన సెలెక్షన్ కమిటీ కాలపరిమితి
  • దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
  • 600 మంది దరఖాస్తు చేసుకున్న వైనం
  • దరఖాస్తులను పరిశీలించిన అడ్వైజరీ కమిటీ
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మ మరోసారి నియమితులయ్యారు. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి గత డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా కొనసాగారు. తాజా నియామకాల్లోనూ ఆయనకు మరోసారి అవకాశం లభించింది. చేతన్ శర్మ మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 

ఇక సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ మేరకు ఖరారు చేసింది. 

గత సెలెక్షన్ కమిటీ కాలపరిమితి 2022 డిసెంబరుతో ముగిసింది. గత నవంబరు 18న ఐదుగురు సెలెక్టర్ల పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా, 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసిన సీఏసీ తాజా నియామకాలు చేపట్టింది.
Chetan Sharma
Chairman
Selection Committee
BCCI
CAC
Team India

More Telugu News