Man: ‘బాహుబలి’ దంతాలు.. 15,730 కిలోల ట్రక్కును లాగేసి రికార్డ్

Man pulls 15730 kg truck with his teeth sets Guinness World Record

  • ఈజిప్ట్ కు చెందిన సులీమాన్ ఘనత
  • ఈ విషయాన్ని ప్రకటించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
  • సరదా కామెంట్లతో స్పందిస్తున్న నెటిజన్లు

ఓ వ్యక్తి తన దంతాలకు ఉన్న బలం ఏపాటిదో నిరూపించాడు. ఈజిప్ట్ కు చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ 15,730 కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశాడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ప్రకటించింది. పళ్లతో ట్రక్కును లాగుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది. (వీడియో కోసం)

రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించగా, 24,961 లైక్ లు వచ్చాయి. దీనిపై ఓ యూజర్ హాస్యయుక్తంగా స్పందించాడు. ‘ఆయన్ను చూసే డెంటిస్ట్ ఎవరో కానీ, నేను కూడా వెంటనే వెళ్లి కలవాలి’ అని కామెంట్ చేశాడు. ఆయన దంతాలే ఆయనకున్న బలం, ఆయన దంతాలే ఆయన కండరాలు, నా చేతుల కంటే ఆయన దంతాలే గట్టివి.. అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Man
egypt
pullls truck
teeth
Guinness World Record
  • Loading...

More Telugu News