Sharwanand: ఎన్నారై అమ్మాయిని పెళ్లాడబోతున్న హీరో శర్వానంద్?

Actor Sharwanand to get married
  • ప్రేమ వివాహం చేసుకోబోతున్న శర్వానంద్
  • కాబోయే భార్య అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి 
  • వేసవిలో వీరి పెళ్లి జరగనున్నట్టు టాక్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. శర్వాకు కాబోయే భార్య అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోందని చెపుతున్నారు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ... కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. 

ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణకు చెందిన యువతి అని ఫిలింనగర్ టాక్. కొన్నాళ్లుగా ఆ అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని చెపుతున్నారు. ఈ వేసవిలో వీరి పెళ్లి జరగనుంది. తన పెళ్లికి సంబంధించి త్వరలోనే శర్వానంద్ అధికారికంగా ప్రకటన చేయనున్నాడు.  
Sharwanand
Tollywood
Marriage

More Telugu News