Ajith: అజిత్ 'తెగింపు' నుంచి పక్కా మాస్ సాంగ్ రిలీజ్!

  • అజిత్ నుంచి మరో భారీ యాక్షన్ మూవీ
  • కథానాయికగా కనిపించనున్న మంజూ వారియర్
  • సంగీతాన్ని అందించిన గిబ్రాన్ 
  • జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్
Tegimpu Movie

అజిత్ కథానాయకుడిగా తమిళంలో 'తునీవు' చిత్రం రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నారు. తెలుగులో అదే రోజున 'తెగింపు' పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'ఛిలా ఛిలా ఛిల్లా' అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. ఇది పక్కా మాస్ సాంగ్. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ యాక్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే అజిత్ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తోంది. 

అజిత్ సరసన నాయికగా మంజూ వారియర్ నటించింది. ఆమె కనిపించిన పోరాట సన్నివేశాలు కూడా ఈ సినిమాకి హైలైట్ కానున్నాయని అంటున్నారు. గిబ్రాన్ నుంచి వచ్చిన సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సముద్రఖని .. అజయ్ .. చిరాగ్ జాని ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు

More Telugu News