Ravivarma: సస్పెన్స్ థ్రిల్లర్ గా 'ప్రత్యర్థి' .. ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్‌!

Prathyarthi Movie Trailer Released

  • విభిన్న కథా చిత్రంగా 'ప్రత్యర్థి'
  • పోలీస్ ఆఫీసర్ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • నిర్మాతగా వ్యవహరించిన సంజయ్ సహ
  • ఈ నెల 6వ తేదీన సినిమా విడుదల

తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. రొటీన్ మాస్ మసాలా చిత్రాలను అంతగా ఇష్టపడటం లేదు. కొత్త కథలను, ఎగ్జయిటింగ్ అనిపించే కథనంతో వచ్చే చిత్రాలను ఆదరిస్తున్నారు. అలాంటి కొత్త సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ప్రత్యర్థి' అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. 

రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షతలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శంకర్ ముడావత్ దర్శకత్వం వహించగా, సంజయ్ సహ దీనిని నిర్మించారు. జనవరి 6న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.

నగరంలో జరిగిన మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఎస్ఐ చనిపోవడం, ఆ కేసును పరిష్కరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూసి కథను మాత్రం కచ్చితంగా అంచనా వేయలేం. ఈ సినిమాలో ఊహించినదానికి మించి ట్విస్టు లున్నాయని మేకర్స్ తెలిపారు

Ravivarma
Rohith Behal
Akshatha
Prathyarthi Movie
  • Loading...

More Telugu News