Ajith: నాలాంటి కంత్రీగాడితో పెట్టుకుంటే ఇంతే: 'తెగింపు' తెలుగు ట్రైలర్ రిలీజ్

Thegimpu Telugu Trailer Released

  • యాక్షన్ ఎంటర్టయినర్ గా 'తెగింపు'
  • డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అజిత్
  • కీలకమైన పాత్రను పోషించిన సముద్రఖని 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

అజిత్ హీరోగా తమిళంలో 'తునీవు' సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో అజిత్ సరసన నాయికగా మంజూ వారియర్ కనిపించనుంది. తమిళనాట ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. 

తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. తాజాగా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హెలికాప్టర్లు  .. పవర్ బోట్లు .. ఛేజింగ్స్ తో సినిమాలోని భారీతనాన్ని శాంపిల్ గా చూపించారు. 

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అజిత్ పాత్రను డిజైన్ చేసినట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. సముద్రఖని .. అజయ్ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించారు. మంజు వారియర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొందనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అజిత్ ఈ సినిమాతో కొత్త రికార్డులను సెట్ చేస్తాడేమో చూడాలి.

Ajith
Manju
Samudrakhani
Ajay
Thegimpu Movie
  • Loading...

More Telugu News