Amazon: మరింత తక్కువ ధరకే వన్ ప్లస్ 11టీ

OnePlus 10T gets flat Rs 5000 discount on Amazon Check out price and other details
  • అమెజాన్ పై రూ.44,999కే విక్రయం
  • యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే మరో రూ.1,500 తగ్గింపు
  • పాత ఫోన్ ఎక్చేంజ్ చేసుకునే వారికి మరింత తక్కువకే అందుబాటు
వన్ ప్లస్ ప్రియులకు ‘వన్ ప్లస్ 10టీ’ ఇప్పుడు మరింత తక్కువ ధరకు వస్తోంది. అమెజాన్ ఈ ఫోన్ పై పెద్ద డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. ఇది 5జీ ఫోన్. ఇయర్ ఎండింగ్ సందర్భంగా పలు ఇతర ఫోన్లపైనా తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ 10టీ 8జీబీ ర్యామ్, 12జీబీ స్టోరేజ్ ధర ప్రస్తుతం రూ.44,999గా ఉంది. యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 డిస్కౌంట్ కూడా సొంతం చేసుకోవచ్చు.

12జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.49,999, 16జీబీ ర్యామ్ ధర  50,999గా ఉంది. ఈ ఫోన్లు అన్ని వేరియంట్లపైనా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు, పాత ఫోన్ ఎక్చేంజ్ పై ఆర్డర్ చేస్తే మరింత తక్కువకే వస్తోంది. పాత ఫోన్ మార్పిడిపై మోడల్ ను బట్టి రూ.22,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Amazon
OnePlus 10T
discount
offers

More Telugu News