sam: నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిదే.. సమంత

Actress Samantha pens Strong Note Ahead of New Year

  • చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన హీరోయిన్
  • అభిమానులకు అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ  పోస్ట్
  • కొన్ని రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సమంత

అరుదైన వ్యాధి మయోసైటిస్ తో బాధపడుతూ కొన్నిరోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సమంత మరోసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. కొత్త ఏడాది రాబోతుండడంతో తన అభిమానులకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుని కొత్త ఏడాదిలో వాటిని సాధించేందుకు కష్టపడాలని సూచించింది. అయితే, లక్ష్యాలను నిర్దేశించుకునే సమయంలో సాధ్యాసాధ్యాలను గమనించుకోవాలని సామ్ చెప్పింది. సులభమైన, మీరు చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలని సూచిస్తూ.. దేవుడి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయని తెలిపింది. కొత్త ఏడాదికి ముందస్తుగా మీకు శుభాకాంక్షలు అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమా యశోదతో సామ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటనకు సమంతకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా తర్వాత ఏ షూటింగ్ లోనూ పాల్గొనడంలేదు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఖుషి సినిమాలో సామ్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ సామ్ మాత్రం పాల్గొనడంలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాతే షూటింగ్ కు సామ్ హాజరవుతారని తెలుస్తోంది.

sam
yasoda
Samantha
new year wishes
Instagram post
khushi
  • Loading...

More Telugu News