Zomato app: జొమాటోలో ఒకే ఒక్కడు.. 3300 ఫుడ్ ఆర్డర్లు

Delhi man placed 3330 food orders through Zomato app in 2022 around 9 orders every single day

  • రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చిన ఢిల్లీ వాసి
  • ప్రోమో కోడ్ లతో ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది రాయ్ గంజ్ వాసులు
  • ఆర్డర్ల పరంగా బిర్యానీ నంబర్ 1, పిజ్జా నంబర్ 2

జొమాటో ఈ ఏడాది తన ఫుడ్ డెలివరీ యాప్ పై ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికర విషయాలను (వార్షిక నివేదిక) వెల్లడించింది. బిర్యానీ కోసమే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. ఇటీవల స్విగ్గీ సైతం తన ప్లాట్ ఫామ్ పై ఆర్డర్ల పరంగా బిర్యానీ నంబర్ 1 స్థానంలో ఉన్నట్టు ప్రకటించడం తెలిసిందే. జొమాటో యాప్ పై ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ ఒక నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లను పొందడం గమనార్హం. 

జొమాటోలో ఈ ఏడాది ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 3300 ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్ గా నిలిచాడు. అంటే రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చినట్టు అయింది. ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్ లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్ లోని రాయ్ గంజ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు. 

ముంబైకి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ లను అప్లయ్ చేయడం ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. బిర్యానీ తర్వాత జొమాటో యాప్ పై  పిజ్జా కోసం ఎక్కువ మంది ఆర్డర్ చేశారు. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చాయి.

Zomato app
orders
Delhi man
3330 food orders
biryani
pizza
  • Loading...

More Telugu News